మెస్సీ వాడిన టిష్యూకు వేలంలో రూ. 7 కోట్లు

by Shyam |
Lionel Messi
X

దిశ, ఫీచర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ.. బార్సిలోనా జట్టుకు వీడ్కోలు చెప్పి ఫుట్‌బాల్ వరల్డ్‌తో పాటు అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ నెల మొదట్లో బార్సిలోనాలో తన ఫేర్‌వెల్ ప్రెస్ కాన్ఫిరెన్స్‌ సందర్భంగా మెస్సీ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే ఆ టైమ్‌లో కన్నీళ్లు తుడుచుకునేందుకు తను ఉపయోగించిన టిష్యూను తాజాగా వేలం వేయడం విశేషం.

ఈ స్టార్ ప్లేయర్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమ్ దృష్ట్యా.. అతని వస్తువులకు భారీ డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే అతడు ఉపయోగించిన టిష్యూ(హ్యాండ్ కర్చీఫ్)ను అభిమానుల కోసం వేలంలో పెట్టిన ప్రముఖ వెబ్‌సైట్ ‘మెర్కాడో లిబ్రే’.. 1 మిలియన్ డాలర్లకు విక్రయించినట్లు అర్జెంటీనా మీడియా అవుట్‌లెట్ ‘మిషన్స్ ఆన్‌లైన్’ వెల్లడించింది. కాగా ఈ టిష్యూను పొందిన వ్యక్తి.. సరైన ధర వస్తే విక్రయిస్తానని ఆన్‌లైన్‌లో అనౌన్స్ చేశాడు. అంతేకాదు భారీ ధరను కోట్ చేయడాన్ని సమర్థించుకుంటూ.. ‘ఈ టిష్యూలో ఉన్న మెస్సీ జెనెటిక్ మెటీరియల్ ఉపయోగించి క్లోనింగ్ ద్వారా మరొక ఫుట్‌బాల్ ప్లేయర్‌ను తయారుచేయొచ్చు’ అని పోస్టు చేయడం విశేషం.

నిజానికి ఒరిజినల్ టిష్యూ పేపర్‌నే అమ్మకానికి పెట్టినా.. ప్రస్తుతం దాని డూప్లికేట్స్ కూడా ఆన్‌లైన్‌లో అమ్ముడవుతున్నాయని Minutouno.com తెలిపింది. కాగా బార్సిలోనా జట్టుకు వీడ్కోలు పలికిన 34 ఏళ్ల మెస్సీ.. ఇప్పుడు తన కొత్త జట్టు ‘పారిస్ సెయింట్-జర్మన్(పీఎస్‌జీ) కోసం ఆడనున్నాడు. పీఎస్‌జీతో మెస్సీ రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకోగా.. ఇతర ప్రయోజనాలు కాకుండా అతనికి సీజన్‌కు million 35 మిలియన్లు చెల్లించనుంది.

Advertisement

Next Story