ఆ ముగ్గురికి టెస్టు‌ మ్యాచులో చోటు లేదు

by Shyam |
ఆ ముగ్గురికి టెస్టు‌ మ్యాచులో చోటు లేదు
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాతో జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగమైన తొలి టెస్టు గురువారం ఉదయం అడిలైడ్ ఓవల్ మైదానంలో జరుగనున్నది. ఆసీస్ గడ్డపై భారత జట్టు ఆడనున్న తొలి పింక్ బాల్ (డే/నైట్) టెస్టుకు తుది జట్టును ప్రకటించారు. వార్మప్ మ్యాచ్‌లో విఫలమైనా పృథ్వీషాకు జట్టులో చోటు దక్కింది. ఇతనితో పాటు మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయగా.. కీపర్‌గా వృద్దిమాన్ సాహను ఎంపిక చేశారు. కేఎల్ రాహుల్, శుభమన్‌గిల్, రిషబ్ పంత్‌లకు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక భారత జట్టు ఈ మ్యాచ్‌లో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనున్నది. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్‌తో పాటు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు కల్పించింది. మరోవైపు ఎవరైనా ఆటగాడు కంకషన్‌కు గురైతే వారి బదులు తీసుకోవడానికి 7 గురు అదనపు ఆటగాళ్లు బెంచ్‌లో సిద్దంగా ఉన్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు అడిలైడ్ ఓవల్‌లో పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది.

తుది జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారి, వృద్దిమాన్ సాహ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమి, జస్ప్రిత్ బుమ్రా.

Advertisement

Next Story

Most Viewed