ముంబైలో క్వారంటైన్.. శ్రీలంకలో ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లు

by Shiva |
dawan-bhuvi 3
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు ముంబైలో 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నది. జూన్ 14 (సోమవారం) నుంచి ఈ నెల 28 వరకు క్రికెటర్లు అందరూ క్వారంటైన్‌లో ఉంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. రెండు వారాల్లో మొత్తం 6 సార్లు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహిస్తామని ఆయన అన్నారు. క్రికెటర్ల కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్లు ఏర్పాటు చేశామని… కొంత మంది కమర్షియల్ విమానాల్లో ముంబై చేరుకుంటారని ఆయన చెప్పారు.

ముంబైలో తొలి వారం ఒకరిని ఒకరు కలుసుకోకుండా కఠినమైన క్వారంటైన్‌లో ఉంటారని.. ఆ తర్వాత వారం రోజులు ఒకరిని ఒకరు కలుసుకునే వీలుంటుందని ఆయన చెప్పారు. ముంబై నుంచి శ్రీలంక వెళ్లిన తర్వాత అక్కడ మరో మూడు రోజులు హోటల్‌లో క్వారంటైన్‌లో గడపనున్నారు. అనంతరం భారత జట్టు రెండు జట్లుగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లు ఆడనున్నది. ధావన్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జులై 13 నుంచి 18 వరకు వన్డే మ్యాచ్‌లు, 21 నుంచి 25 వరకు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నది. అన్ని మ్యాచ్‌లు కొలంబోలోనే నిర్వహించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed