- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టుల్లో నెంబర్ 1.. టీమ్ ఇండియా
దిశ, స్పోర్ట్స్ : టెస్ట్ క్రికెట్‌లో నెంబర్ వన్ జట్టుగా టీమ్ ఇండియా మరోసారి నిలిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఇండియాకు ప్రత్యర్థి అయిన న్యూజీలాండ్ కేవలం ఒకే ఒక పాయింట్ తేడాతో రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. టీమ్ ఇండియా 212 రేటింగ్ పాయింట్లు, మొత్తంగా 24 మ్యాచ్‌లలో 2914 పాయింట్లు సాధించింది. న్యూజీలాండ్ 120 రేటింగ్ పాయింట్లు, 18 టెస్టులు ఆడి 2166 పాయింట్లు సంపాదించింది. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లపై సిరీస్ విజయాలు సాధించడంతో టీమ్ ఇండియా రేటింగ్ పాయింట్లు పెరిగి అగ్రస్థానానికి చేరుకున్నది. ఇక స్వదేశంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లపై గెలవడం ద్వారా న్యూజీలాండ్ జట్టు రెండో స్థానానికి చేరుకున్నది. 2020 నుంచి జరిగిన మ్యాచ్‌లకు 100 శాతం రేటింగ్ పాయింట్స్, అంతకు రెండేళ్ల ముందు 50 శాతం పాయింట్లు కలిపి ఈ ర్యాంకులు ఇచ్చింది. దీంతో ఈ క్రికెట్ సీజన్‌ను టీమ్ ఇండియా అగ్రస్థానంతో ముగించింది.
ర్యాంకింగ్స్
1. ఇండియా (121 రేటింగ్స్)
2. న్యూజీలాండ్ (120)
3. ఇంగ్లాండ్ (109)
4. ఆస్ట్రేలియా (108)
5. పాకిస్తాన్ (94)
6. వెస్టిండీస్ (84)
7. సౌతాఫ్రికా (80)
8. శ్రీలంక (78)
9. బంగ్లాదేశ్ (46)
10. జింబాబ్వే (35)