- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏం చేయలేకపోయాం.. బాధగా ఉంది : కోహ్లీ
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో ఆడిలైడ్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోరంగా ఓటమి చెందింది. టీమిండియా టెస్టు చరిత్రలోనే అత్యంత తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు మాత్రమే చేసిన భారత్, రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఓటమి తప్పలేదు. మ్యాచ్ అనంతరం భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం నాకు మాటలు రావడం లేదు. మైదానంలో అడుగుపెట్టేసరికి 60 పరుగుల ఆధిక్యంలో ఉన్నాం. కానీ వెనువెంటనే అంతా ముగిసిపోయింది. రెండు రోజుల పాటు బాగానే ఆడాం. కానీ చివరి సమయంలో ఏం చేయలేకపోయాం. ఇది నిజంగా నన్ను బాధించింది. పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాం. కానీ అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిర్లక్ష్య ఆటతీరు, ప్రత్యర్థి జట్టు బౌలర్లు బంతులు సంధించిన విధానం రెండూ కూడా ఓటమికి కారణమయ్యాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.