- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. త్వరలో మళ్లీ టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్
దిశ, వెబ్‌డెస్క్: నరాలు తెగే ఉత్కంఠ, మైదానంలో యుద్ధ వాతావరణం కేవలం ఇది ఇండియా,పాకిస్థాన్ మ్యాచులోనే చూస్తాం. అలాంటి పోరుకు అంతర్జాతీయ సమస్యల వల్ల ఈ రెండు దేశాల మధ్య మ్యాచులకు బ్రేకులు వస్తున్నాయ్. దీంతో, కేవలం ICC టోర్నీల్లోనే ఈ రెండు జట్లు తలపడుతున్నాయ్.
అయితే, క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మళ్లీ ఈ రెండు జట్లు త్వరలోనే తలపడనున్నాయ్. ఆసియా కప్ 2022కి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ సెప్టెంబర్ లో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. అయితే ఈ ఆసియా కప్ T20 ఫార్మాట్ లో జరగనుంది. ఇక 2023 ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ 50 ఓవర్ల ఫార్మాట్ లో జరగనుంది.
అయితే మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. వచ్చే ఏడాది T20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. ఈ మెగాటోర్నీలో కూడా పాక్ జట్టుతో భారత్ తలపడే ఛాన్సు ఉంది. ఓవరాల్ గా మరోసారి చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్ కోసం కేవలం ఇండియా, పాక్ ఫ్యాన్సే కాదు… యావత్ క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.