చదువుకోవడానికి ఇబ్బంది అవుతోంది.. వాహనాలు తొలగించండి

by Aamani |
Students protest
X

దిశ, నేరడిగొండ: ప్రభుత్వ కళాశాల ఆవరణలో నిలిపిన వాహనాల వల్ల చదువులకు ఇబ్బంది అవుతోందని, ముఖ్యంగా దీని మూలంగా సరైన క్రీడా స్థలం లేకుండా పోతోందని విద్యార్థులు గురువారం ఆందోళన చేశారు. ఈ విషయమై జిల్లాలోని ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఫారెస్ట్ ఆఫీస్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో వాహనాలు తొలగించాలని అధికారులకు వినతిపత్రం అందజేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సభాన, తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed