- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు ఆకలి తీరుస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుడు
దిశ, వెబ్ డెస్క్: కరోనా కారణంగా పాఠశాలలు సహా అన్ని దుకాణాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. అయితే.. ఇంగ్లాండ్ లోని ఓ పాఠశాలలోని పేద విద్యార్థులకు ‘మిడ్ డే మీల్స్’ అందిస్తారు. అయితే లాక్ డౌన్ వల్ల స్కూల్ లేకపోవడంతో.. ఎంతోమంది విద్యార్థులు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది గమనించిన ఆ పాఠశాల ఉపాధ్యాయుడు .. తన 78 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కోసం ప్రతిరోజు 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి వాళ్లకు ఆహారం అందిస్తున్నాడు.
మన కడుపు నిండితే చాలనుకునే వాళ్లు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ మనతోపాటు.. ఇతరుల ఆకలి కూడా తీర్చాలనుకునే వాళ్లు అరుదుగా ఉంటారు. ఇంగ్లాండ్ కు చెందిన జేన్ పావల్స్ అనే టీచర్ ఆ అరుదైన కోవలోకే వస్తారు. ఇంగ్లాండ్, గ్రిమ్స్ బై లోని వెస్టర్న్ ప్రైమరీ స్కూల్లో అసిస్టెంట్ హెడ్ గా పనిచేసే పావెల్స్ కు మంచి ఉపాధ్యాయుడిగా పేరుంది. ఆ స్కూల్లో చదివే విద్యార్థుల్లో 41 శాతం మంది ‘ఫ్రీ స్కూల్ మీల్స్’ కు అర్హులు. కరోనా వల్ల లాక్డౌన్ సమస్య ఎదురైనప్పటి నుండి పాఠశాల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి ఆహారం అందిస్తున్నారు. ఇందుకోసం అతను రోజూ 8 కిలోమీటర్లకు పైగా దూరం నడుస్తాడు. ప్రతి రోజు పాఠశాల కిచెన్ లో సిద్దమైన ఆహారాన్ని 78 ప్యాకెట్లలో సర్దుకుని ఇంటింటికీ బయలుదేరుతాడు. దాదాపు 20 కిలోల బరువుండే ఆ ఆహారపు పొట్లాలను తన భుజానికి వేసుకుని నడక సాగిస్తాడు. అవన్నీ విద్యార్థులకు ఇచ్చి రావడానికి మూడు గంటలకుపైనే పడుతుంది. పావెల్స్ చేస్తున్న కృషికి నెటిజన్లు, విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పావెల్స్ పాటు, హెడ్ టీచర్ కిమ్ లీచ్, మరో ఉపాధ్యాయుడు మరో 25 లంచ్ ప్యాకెట్లను కార్లో వెళ్లి విద్యార్థులకు ఇచ్చి వస్తారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో ఇలాంటి సేవ చేస్తున్న ఉపాధ్యాయుల్ని చూసి.. ఎంతో ఆనందమేస్తోందని ఓ విద్యార్థి తండ్రి చెబుతున్నారు.
tags :corona virus, lockdown, lunch, teacher, students, zane powels, england