- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ జెండా ఎగురవేసినందుకు ప్రధానోపాధ్యాయుడి సస్పెన్షన్..
దిశ, బోధన్ : ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండా బదులుగా టీఆర్ఎస్ జెండా ఎగురవేసిన కారణంగా ప్రధానోపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు.ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. బోధన్ పట్టణం అంబేద్కర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయేన్దర్ ఈ నెల 2న పాఠశాలలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశాడు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ప్రాథమిక నివేదిక, ఫొటోల ఆధారంగా శుక్రవారం ప్రధానోపాధ్యాయుడును సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి
ఎన్. దుర్గా ప్రసాద్ ప్రకటన ద్వారా తెలిపారు.
అంబేద్కర్ కాలనీ పాఠశాలలో 18 వార్డ్ కౌన్సిలర్ బెంజర్ గంగాధర్ జాతీయ జెండా బదులుగా తెలంగాణ పార్టీ జెండాను సుమారు ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎగురవేశారు. అప్పుడు పాఠశాల తలుపులకు తాళాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాక ముందే అతనికి తెలియజేయకుండా టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగురవేసి ఒక ప్రభుత్వ ఉద్యోగి జాబ్ పొగొట్టి అతని ఫ్యామిలీని రోడ్డున పడవేసిన ఘనత 18వ వార్డ్ టీఆర్ఎస్ కౌన్సిలర్‌కు దక్కింది. రాజకీయ నాయకుల చర్యలకు ప్రధానోపాధ్యాయుడిని బలిచేయడం సరికాదు. ఇదిఇలాగే వదిలేస్తే జనవరి 26, ఆగస్ట్ 15 నాడు కూడా జాతీయ జెండాకు బదులు గులాబీ పార్టీ జెండా ఎగరవేస్తారు. ఇది పునరావృతం కాకుండా వెంటనే కలెక్టర్ స్పందించి వార్డు కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు, అలాగే వార్డు ప్రజలు, విద్యార్థుల తల్లితండ్రులు కోరుతున్నారు.