మదనపల్లిలో దారుణం : బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి

by Sumithra |
మదనపల్లిలో దారుణం : బాలికపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ బాలికపై అమానుషంగా ప్రవర్తించాడు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్దాడు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బాలికను బెదిరించాడు. దీంతో ఎవరికీ ఏం చెప్పలేక బాలిక మానసిక క్షోభను అనుభవించింది. చివరికి ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story