- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసులపై యనమల ఫైర్
దిశ వెబ్ డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు పోలీసులు నోటిసులు ఇవ్వడంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండి పడ్డారు. ఓం ప్రతాప్ అనే వ్యక్తి మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో టీడీపీ నాయకులకు నోటీసులు పంపడంపై పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని లేఖ రాస్తే సాక్ష్యాలు ఇవ్వండి, విచారిస్తామని పోలీసులు అనడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా బండకాడ పల్లి దళితవాడకు చెందిన ఓం ప్రతాప్ మృతి విషయంలో వైసీపీ మంత్రుల హస్తం ఉందని టీడీపీ నాయకులు విమర్శలు చేశారు. కాగా ఈ విషయంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగు దేశం సీనియర్ నేత వరాల రామయ్యకు పోలీసులు నోటీసులు పంపారు. ఆరోపణలకు సంబందించి ఏమైనా ఆధారాలు ఉంటే తమకు అందించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు వారం రోజుల్లో సమాధానం అందించాల్సిందిగా నోటీసుల్లో తెలిపారు.