- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దివ్యాంగుల స్కూల్ కూల్చడం దారుణం: చంద్రబాబు
దిశ, ఏపీ బ్యూరో: దివ్యాంగుల స్కూల్‌ను కూల్చివేయడం హేయమైన చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని కోరుతూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కి లేఖ రాశారు. విశాఖలోని దివ్యాంగుల పాఠశాల నిర్మాణాల తొలగింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడడం దారుణమన్నారు. విభిన్న ప్రతిభావంతుల కోసం ఆ పాఠశాలను లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. దాని ద్వారా పేద కుటుంబాలకు చెందిన 190 మంది సేవలు పొందుతున్నారని గుర్తు చేశారు.
నష్టపోయిన బాధిత వర్గానికి వెంటనే న్యాయం చేయాలని కోరారు. ప్రజలకు లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తోన్న సంస్థ నిర్మాణాలను సీజ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు