టీటీడీపీ కమిటీని ఎప్పుడు ప్రకటిస్తారంటే…

by Shyam |
టీటీడీపీ కమిటీని ఎప్పుడు ప్రకటిస్తారంటే…
X

దిశ వెబ్ డెస్క్:
టీడీపీ జాతీయ కమిటీని ఈనెల 27న ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణలో రాష్ట్రకమిటీని కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి కూడా తెలంగాణలో టీడీపీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు రమణకే దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 80మందితో కూడిన జాబితాను ఇప్పటికే పార్టీ అధినేత సిద్దం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఏడేండ్లుగా ఒక్కరే అధ్యక్షునిగా ఉండటంతో పార్టీ పరిస్థితి ఆందోళన కరంగా మారిందని చంద్రబాబుకు సీనియర్లు లేఖ రాశారు. అందుకే అధ్యక్షున్ని మార్చాలంటూ లేఖలో సీనియర్లు కోరిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed