ఆలయాల సంరక్షణలో ప్రభుత్వం విఫలం :బాలకృష్ణ

by srinivas |
ఆలయాల సంరక్షణలో ప్రభుత్వం విఫలం :బాలకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: మా ప్రభుత్వం హయాంలో ఎక్కడా ఆలయాలను కూల్చలేదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. ఒకవేళ కూల్చినా అది ప్రజా అవసరాల కోసమేనని తెలిపారు. ఆలయాల సంరక్షణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురాన్ని జిల్లా చేసేందుకు అవసరమైతే సీఎంను కలుస్తానని బాలకృష్ణ తెలిపారు.

హిందూపురంలో పేకాట, మట్కాను వైసీపీ ప్రోత్సహిస్తోందని బాలకృష్ణ మండిపడ్డారు. మట్కాకు స్థానిక వైసీపీ నేతలు ఆర్థికంగా చేయూతనిస్తున్నారని విమర్శించారు. నేతల మాట వినకపోతే అధికారులను మార్చేస్తున్నారన్నారు. శాంతికి మారుపేరైన హిందూపురాన్ని అరాచకంగా మారుస్తున్నారని తెలిపారు. 18 నెలల్లోనే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని తెలిపారు. ప్రజలు ఉద్యమించాలి.. లేదంటే ఏపీ 20 ఏళ్ల వెనక్కి వెళ్తుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story