అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. నల్ల చొక్కాలతో టీడీపీ నేతలు

by srinivas |
అక్రమ అరెస్టులను నిరసిస్తూ.. నల్ల చొక్కాలతో టీడీపీ నేతలు
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ నేతల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆ పార్టీ నేతలు నల్ల చొక్కాలతో శాసన సభ సమావేశాలకు హాజరయ్యారు. తొలుత వెంటకపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పూల మాలలతో నివాళులర్పించారు.

అనంతరం నారా లోకేశ్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి విధ్వంసం సాగిస్తున్నారని నినాదాలు చేశారు. సొంత అజెండా అమలు చేసేందుకే శాసనసభ సమావేశాలు కేవలం రెండు రోజులకు పరిమితం చేశారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

Advertisement

Next Story