- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒంటరైన నారా లోకేశ్.. హ్యాండ్ ఇస్తున్న టీడీపీ నేతలు
దిశ, ఏపీబ్యూరో: ఏపీ తెలుగుదేశం పార్టీలో అంతర్గతపోరు తారా స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అనుకూల వర్గం…వ్యతిరేక వర్గాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల కర్నూలులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో హత్యకు గురైన నేతల కుటుంబాలని లోకేష్ పరామర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో సీఎం జగన్‌పై టంగ్‌స్లిప్ అయ్యారు. పరుష పదజాలంతో రెచ్చిపోయారు. లోకేశ్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలూ రెచ్చిపోయారు. ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు రోజా, అంబటి రాంబాబు, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేశ్ కేంద్రంగా తీవ్ర విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం జగన్‌ను ఒక్కసారి పరుషపదజాలంతో దూషిస్తే ఆ పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
అయితే లోకేశ్‌పై వారు చేస్తున్న విమర్శలను ఎవరూ ఖండించడం లేదు. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు మినహా ఎవరూ అంతగా రియాక్ట్ అవ్వడం లేదు. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు చెందిన నేతలెవరూ లోకేశ్‌కు మద్దతుగా ఒక్క కామెంట్ కూడా చేయడం లేదు. నారా లోకేశ్ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఇలా ఎవరూ నోరు మెదపడం లేదు. ముఖ్యంగా ప్రత్యర్థులపై విరుచుకుపడే బోండా ఉమా నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కేవలం మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు తప్ప ఇంకెవరూ లోకేశ్‌కు బాసటగా నిలబడటం లేదు. దీంతో సొంత వర్గం నాయకులే చినబాబుకు హ్యాండ్ ఇచ్చారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.