- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పారు: మంత్రి బొత్స
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ సభ్యులు కేవలం గొడవ పెట్టుకునేందుకే అసెంబ్లీకి వచ్చారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మీడియాతో బొత్స శనివారం మాట్లాడుతూ… అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని వివరించినట్లు తెలిపారు. 5.65 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.67వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఏడాదిన్నర పాలనలో చేసిన సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లెక్కలతో సహా చూపించినట్లు పేర్కొన్నారు.
పోలవరం ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గించడం లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పినట్లు బొత్స వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని చెప్పారు. సభా సంప్రదాయాలకు విలువ ఇవ్వకుండా అసెంబ్లీలో స్పీకర్‌ను, మండలిలో ఛైర్మన్‌ను చుట్టుముట్డడం దారుణమన్నారు. సభా నియమాలు పాటించకుండా బాబు పోడియం వద్ద బైఠాయించి స్పీకర్‌ను బెదిరించేలా వ్యవహరించడం సరైన పద్దతి కాదని చెప్పారు. స్పీకర్‌పై చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగి సభను అపహాస్యం చేశారని మంత్రి బొత్స విమర్శించారు.