టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలు : యనమల

by srinivas |
టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలు : యనమల
X

రాష్ర్టంలో వైసీపీ ప్రభుత్వం టీడీపీపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఇవాళ ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ… అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లును మండలి పరిశీలించొచ్చని తెలిపారు. రాజ్యసభకు ఉన్నట్టే రాష్ర్టంలో శాసన మండలికి కూడా అధికారాలు ఉంటాయన్నారు. మూడు రాజధానుల బిల్లను సెలెక్ట్ కమిటీకి పంపితే… వైసీపీ ప్రభుత్వానికి అంత భయమెందుకు అని ఆయన ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక బిల్లులపై మాట్లాడితే తప్పా…? అని యనమల అన్నారు.

Advertisement

Next Story