- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైసీపీది శునకానందం..కుప్పం రిజల్ట్స్‌పై నారా లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: కుప్పం మున్సిపల్ ఫలితాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. దొంగ ఓట్లు, వందల కోట్లు, గూండాగిరి, అధికారులు-పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని.. లోకేశ్ రెండు చెంపలను ప్రజలు పగలగొట్టారని వైసీపీ శునకానందంలో ఉన్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్‌కి వ్యతిరేకంగా ఓటేసి జగన్ బట్టలూడదీసి వాయగొట్టారనేది బులుగు బుర్రలకు ఎప్పుడెక్కుతుందో అని లోకేశ్ ట్విట్ చేశారు. మరోవైపు కుప్పంలో టీడీపీ ఓడిపోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
కుప్పం గెలుపును ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వం, పోలీసులు, డబ్బు పంపిణీ వల్లే కుప్పంలో గెలుపు సాధ్యమైందని.. మంత్రులు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. దొంగ ఓట్లతో గెలిచి మంత్రులు బోకేలు ఇచ్చుకోవడం దారుణమన్నారు. వైసీపీ ఎన్ని అరాచకాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు చేసిన పోరాటాన్ని అభినందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వైసీపీతో హోరాహోరీ ఫైట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.