- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
X
దిశ, వెబ్ డెస్క్: జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేసి వేధిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాసరయ్య కుటుంబంపై జగన్ రెడ్డి గూండాలు దాడి చేశారని ఆరోపించారు. అయితే పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులు అని విమర్శించారు. కక్ష సాధింపు కోసం జగన్ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ట్రాప్‌లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు.
Advertisement
Next Story