- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారులతో అడవుల్లో సొరంగాలు తవ్విస్తున్న వైసీపీ నేతలు
దిశ, వెబ్‌డెస్క్: అధికార వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే.. ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడింది.’’
‘‘విశాఖజిల్లా, గొలుగొండ మండలంలో నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు అత్యంత విలువైన అలెగ్జాండరైట్ రంగురాళ్ల కోసం సాలికమల్లవరం రిజర్వ్ ఫారెస్ట్ లో జేసీబీలను పట్టుకుని వెళ్ళి మరీ యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. అటవీ సిబ్బందిని కూడా బెదిరిస్తున్నారంటే ఎంత బరి తెగింపో చూడండి!’’
‘‘ఇంకా క్రూరంగా వైసీపీ నేతలు వాళ్ళ స్వార్థం కోసం చిన్నారులతో అడవుల్లో ప్రమాదకరమైన సొరంగాలు తవ్వి స్తున్నారు. ఆ పిల్లలకు ఏమైనా జరిగితే బాద్యులెవరు? ఒకవైపు అక్రమ తవ్వకం, మరోవైపు మైనర్ల ప్రాణాలతో చెలగాటం..ఈ నేరాలకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?.’’ అని ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలు అని చెబుతూ ప్రజల కళ్ళుగప్పి మాయ చేస్తోంటే… ఇదే అదనుగా వైసీపీ నేతలు ఇసుక, మట్టి మొదలుకుని ఎర్రచందనం వరకు కాదేదీ దోపిడీకి అనర్హం అన్నట్టు దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా అలెగ్జాండరైట్ రంగురాళ్ల అక్రమ తవ్వకం బయటపడింది.(1/3)@moefcc @prateepifs pic.twitter.com/Ar8UPeqq4m
— Lokesh Nara (@naralokesh) April 18, 2021