స్పీడ్ పెంచిన ఎల్.రమణ.. కేడర్‌తో కీలక భేటీ

by Sridhar Babu |
TDP leader L. Ramana
X
దిశ, జగిత్యాల: ఈటల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి కరీంనగర్‌లో రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్‌లో చేరుతున్నాడన్న వార్తలు సోషల్‌ మీడియాల్లో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్.రమణ పార్టీ ఫిరాయించే విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు.. తన నియోజకవర్గంలో కేడర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. శనివారం రాత్రి జగిత్యాలకు వచ్చిన రమణ ఆదివారం ఉదయం నుంచి సన్నిహితులు, అనుచరుల అభిప్రాయలు తీసుకుంటున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత మరోసారి కేడర్‌తో భేటీ అయ్యి.. తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రమణ దాదాపుగా టీఆర్ఎస్‌లో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. ఇప్పటి వరకు కలిసిన ఆయన సన్నిహితులు కూడా టీఆర్ఎస్‌లో చేరడమే మంచిదన్న అభిప్రాయలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Advertisement

Next Story