- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుబ్బయ్యది ప్రభుత్వ హత్యే : చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: కడప జిల్లా కీలక టీడీపీ నేత నందం సుబ్బయ్య మంగళవారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేనేత కుటుంబానికి చెందిన టీడీపీ నేత సుబ్బయ్య హత్య కిరాతక చర్యగా అభివర్ణించారు. బడుగు బలహీన వర్గాల నాయకులను భౌతికంగా మట్టుపెట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహించారు. ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతిని, కుంభకోణాలను బయటపెడ్డాడనే సుబ్బయ్యను చంపేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ సీఎం అయిన తర్వాత ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. అంతేగాకుండా నందం సుబ్బయ్యది ప్రభుత్వ హత్యే అని, దీనికి సీఎం జగన్ బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే, ఆయన బావమరిది చేస్తున్న అవినీతిని, అక్రమాలపై మాట్లాడినందుకే సుబ్బయ్యను హత్యచేశారని తెలిపారు. వైసీపీ నేతల పాత్రపై పోలీసులు ఆరాతీసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ… సీఎం జగన్ సొంత జిల్లాలో టీడీపీ నాయకులు నందం సుబ్బయ్యను హతమార్చడం.. రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలకు అద్దం పడుతోందన్నారు. 19 నెలల జగన్ రెడ్డి పాలనలో హింస జరగని రోజంటూ ఉందా..? రాష్ట్రాన్ని కత్తులు, కర్రలు, మారణాయుధాలతో పాలన చేస్తూ.. ప్రజానీకానికి ఫ్యాక్షన్ రాజకీయం చూపిస్తున్నారని ఆరోపించారు.