టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్.. ఎందుకంటే !

by srinivas |   ( Updated:2021-01-20 10:04:35.0  )
టీడీపీ నేత కళా వెంకట్రావు అరెస్ట్.. ఎందుకంటే !
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్యసభ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో కళా వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి ఘటనలో కళా వెంకట్రావు అనుచరులు ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలోని కళా వెంకట్రావు ఆఫీస్ వద్దకు వెళ్లిన 300మంది పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కళా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో పోలీసులు ఎక్కడికక్కడే నిలుపుదల చేస్తున్నారు.

Advertisement

Next Story