హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే.?

by srinivas |
హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే.?
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల్లో తాను పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు పిటిషన్ దాఖలు చేశారు. తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని కోరుతూ పిటిషన్ వేశారు. గతంలో నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను చింపేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ పిటిషన్‌కు స్వీకరించిన ధర్మాసనం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Advertisement

Next Story