మహిళ కన్నీరు అరిష్టం: దేవినేని ఉమ

by srinivas |   ( Updated:2020-08-24 11:56:00.0  )
మహిళ కన్నీరు అరిష్టం: దేవినేని ఉమ
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిందని ఆరోపిస్తూ మైలవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళను ఆయన పరామర్శించారు. మహిళలు కన్నీరు పెడితే రాష్ట్రానికి అరిష్టమన్నారు. తాము వైసీపీలో చేరకపోతే కుటుంబం మొత్తాన్ని చంపుతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story