- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజల ప్రాణాలు పోతుంటే.. సీఎం జగన్ IPL మ్యాచ్‌లు చూస్తున్నడు
దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ ప్రభుత్వంపై టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయంలో దేవినేని ఉమ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అనవసరంగా మాపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విస్తరిస్తోన్న విపత్కర పరిస్థితుల్లోనూ విచారణకు హాజరుకావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేశారు.. టెన్త్, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గుజరాత్ అమూల్ కోసం సంగం డెయిరీ ఆస్తులు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర చేసిన తప్పేంటి అని ప్రశ్నించారు. కరోనా మహమ్మారి విస్తృతవ్యాప్తి మూలంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారని ఆరోపించారు. 22 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశా, అక్రమ కేసులు పెట్టి నా గొంతు నొక్కలేరు అని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని డిమాండ్ చేశారు.