50 ఏళ్లు లేవు ఒక్కసారి కూడా సందర్శించరా?: దేవినేని

by srinivas |
50 ఏళ్లు లేవు ఒక్కసారి కూడా సందర్శించరా?: దేవినేని
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో దోచుకున్న 30 వేల ఎకరాలను అమ్ముకోవడానికే అక్కడ రాజధాని ఏర్పాటు అని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. బందర్ పోర్ట్, గన్నవరం‌లో హెచ్‌సీఎల్ నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదని జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. కనకదుర్గ ప్లైఓవర్, పట్టిసీమ, పోలవరం తామే కట్టినట్లు చెప్పుకోండని విమర్శించారు.

కరోనాకు ఇప్పటి వరకు రూ.4,800 కోట్లు ఖర్చు అయినట్లు చెప్పిన జగన్ వ్యాఖ్యలపై దేవినేని స్పందించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఎక్కడెక్కడా ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్ల వయసు లేని సీఎం ఒక్కసారి కూడా కోవిడ్ ఆసుపత్రిని సందర్శించకపోవడం దారుణమన్నారు.

Advertisement

Next Story