- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖననాన్ని అడ్డుకున్న నీచ చరిత్ర వైసీపీది.. అచ్చెన్నాయుడు ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లోనూ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో టీడీపీ దళిత నేత శాంతరాజుపై దాడిచేసి.. అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. అలాగే సంతనూతలపాడులోని మద్దలకట్ట గ్రామానికి చెందిన తంగిరాల జార్జి, అతని భార్యపై వైసీపీ నేతల దాడి మరువకముందే నందికొట్కూరులో శాంతరాజుపై దాడికి తెగబడ్డారు.
బుక్కరాయ సముద్రంలో దళితుల శ్మశాన వాటికకు కంచె వేసి శవ ఖననాన్ని సైతం అడ్డుకునే నీచ రాజకీయాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గంలోని సుంకరిపేట గ్రామంలో కూరగాయలు పండించుకుంటూ జీవానోపాధి సాగిస్తున్న ఆరు దళిత కుటుంబాలపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేశారని చెప్పుకొచ్చారు. దళిత మంత్రులుగా ఉండి కూడా దళితులకు న్యాయం చేయలేని చేతగాని మంత్రులను ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని విరుచుకుపడ్డారు.
అంబేద్కర్ రిజర్వేషన్ ఫలాలతో పదవులు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు సాటి కులస్తులపై దాడులు చేస్తుంటే కనీసం కనికరం కూడా చూపడం లేదని ఇలాంటి వారి వల్ల ఏం ఉపయోగమని ప్రశ్నించారు. జగన్ రెడ్డికి బయపడే మంత్రులు నోరు మెదపడం లేదన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిపైనే దాడులు చేస్తున్న వైసీపీ నాయకులకు దళితులే బుద్ధి చెప్పేరోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దళితులపై దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ కూర్చోదు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని మాట్లాతున్న వైసీపీ నాయకులు ఆ థియరీ వారికీ వర్తిస్తుందని గుర్తించుకోవాలని అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.