అన్ని వివరాలు ఆదివారం వెళ్లడిస్తా : అఖిలప్రియ

by srinivas |
అన్ని వివరాలు ఆదివారం వెళ్లడిస్తా : అఖిలప్రియ
X

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి, దాదాపు 17 రోజుల పాటు రిమాండ్‌లో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా శనివారం షరతులతో కూడిన బెయిల్‌పై చంచల్‌గూడ జైలు విడుదల అయ్యారు. అటు నుంచి ఆమె నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియాకు వెళ్లడిస్తానని చెప్పారు. కేసులో ఎవరెవరి హస్తం ఉందో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి వివరిస్తానని అన్నారు.

Advertisement

Next Story