- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘చంద్రబాబును కొట్టకపోవడం అదృష్టం’’
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తనదైన శైలిలో మరోసారి విరుచుకుపడ్డాడు. విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంలో చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకుని, చంద్రబాబు కాన్వాయ్ మీద కోడిగుడ్లు, టమాటాలు విసిరిన విషయం తెలిసిందే. అయితే దీనిపై జేసీ స్పందించారు. ‘‘విశాఖలో చంద్రబాబును కొట్టకపోవడం అదృష్టమని’’ జేసీ అభిప్రాయపడ్డారు. చంద్రబాబును పోలీసులే కింద పడేసి చావగొట్టకపోవడం సంతోషకమరని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని తప్పుపట్టారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అనుచరులు పోటీ చేయబోరని స్పష్టం చేశారు. అన్నిస్థానాలు ఏకగ్రీవం చేసుకునేందుకే… వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల కోసం కొత్త చట్టం తీసుకొస్తోందని విమర్శించారు. అదే సమయంలో జగన్ తొమ్మిది నెలల పాలన భేష్ అని కితాబిచ్చారు. జగన్ ఎప్పటికీ తమ వాడేనన్నారు. ఇటీవల జేసీ దివాకర్ రెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలకు కూడా జగన్ సర్కారు భద్రత తొలగించింది. రాజకీయ కక్షసాధింపుతోనే తమకు భద్రత తొలగించారని టీడీపీ నేతలు ఆరోపించారు.
Tags: TDP, JC diwakar reddy, comments, chandrababu naidu, jagan government, police, amaravathi tour