- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ దొంగ ఓట్లు.. టీడీపీ ధర్నా
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్ : తిరుపతి ఉపఎన్నికకు ఈ రోజు ఉదయం పోలింగ్ మొదలైంది. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో , నెల్లూరు జిల్లా పరిధిలో నాలుగు, చిత్తూరు జిల్లా పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, వారి మద్దతు దారులు ఇతర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లలో వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. టీడీపీ నేతలు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ బస్సును టీడీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. ఇలా వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎల్ ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాలు వద్దకు చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరిని టీడీపీ నేతలు పట్టుకొని మీడియాకు చూపించారు.
Advertisement
Next Story