అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు..

by srinivas |
అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు బెయిల్‌ మంజూరైంది. రూ.50వేల పూచీకత్తుతో శ్రీకాకుళం జిల్లా సోంపేట అదనపు జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అచ్చెన్న స్వగ్రామం నిమ్మాడలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య జరిగిన ఘటనల ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు సహా 22 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కోసం అచ్చెన్నాయుడు కోరగా ఓసారి వాయిదా వేసిన కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. సోమవారం ఆయనతో పాటు మరో 21 మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Next Story