- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిగ్గజ IT కంపెనీల్లో భారీ నియామకాలు.. 60 వేల మందికి చాన్స్
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఏడాదిలో సంస్థల్లో మహిళా ఉద్యోగులకు మరింత ప్రాధాన్యత కల్పించాలని భావిస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్ కంపెనీలు దాదాపు 60,000 మంది మహిళా అభ్యర్థులను నియమించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. వీరి నియామకాలు ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా 60 శాతం మహిళా అభ్యర్థులను నియమించాలని యోచిస్తోంది. ఎంట్రీ లెవల్ విభాగంలో 22 వేల మంది వరకు అభ్యర్థులను నియమించే అవకాశం ఉంది. విప్రో, ఇన్ఫోసిస్ సంస్థలు ఎంట్రీ లెవల్ నియామకాల్లో దాదాపు 50 శాతం మహిళా అభ్యర్థులను నియమించాలని భావిస్తున్నాయి.
ఇన్ఫోసిస్ సంస్థ 2030 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 45 శాతం మహిళా ఉద్యోగులను తీసుకోవాలని చూస్తోంది. అయితే, ఇందులో దాదాపు 35 వేల మందిని కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన వారిని తీసుకోవాలని, వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది. విప్రో కంపెనీ క్యాంపర్ ఇంటర్వ్యూల ద్వారా 30 వేల మందిని తీసుకోనుంది. ఇందులో సగం మంది మహిళలు ఉండే అవకాశం ఉందని విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ చెప్పారు. టీసీఎస్ సైతం గత మూడేళ్లుగా 38-45 శాతం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సంస్థలో 1.85 లక్షల మహిళా ఉద్యోగులున్నారు. ఇప్పుడు కొత్తగా ఎంట్రీ లెవల్ విభాగంలో 15,000-18,000 మంది మహిళా ఉద్యోగులను నియమించాలని భావిస్తోంది.