దేశీయ ఐటీ రంగం ఆకర్షణీయం : టీసీఎస్ సీఈవో

by Harish |
దేశీయ ఐటీ రంగం ఆకర్షణీయం : టీసీఎస్ సీఈవో
X

దిశ, వెబ్‌డెస్క్: భవిష్యత్తులో ఉద్యోగాలను పొందాలనుకునే వారికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం ఆకర్షణీయమైన గమ్యంగా ఉండనున్నట్టు టీసీఎస్ (TCS) సీఈవో రాజేష్ గోపీనాథన్ చెప్పారు. దేశీయ ఐటీ రంగంలోని ఎంప్లాయిమెంట్ పటిష్టంగా ఉందని, రానున్న రోజుల్లో ఇది మరింత బలంగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం టెక్నాలజీ కీలకంగా మారిన పరిస్థితుల్లో ఐటీ సేవల డిమాండ్ ఇదే స్థాయిలో కొనసాగుతుందని గోపీనాథన్ పేర్కొన్నారు.

ఐటీ రంగం సవాళ్లను అవకాశాలను మలుచుకుందని, క్లిష్ట పరిస్థితుల్లో పలు విభాగాల్లో రాణించిందని, కరోనా రావడం మూలంగా ఐటీ రంగం (IT sector) డిజిటల్ విధానంలోకి మరింత వేగంగా పయనించడానికి అవకాశంగా మారిందన్నారు. అలాగే, కొత్తగా ఉద్యోగాల కోసం వెతికే వారు అనుభవంలేని సంస్థలో ఉన్నప్పటికీ గతంలో కంటే మెరుగైన స్థితిలో ఉన్నట్టు భావించాలని సూచించారు.

దేశీయ ఐటీ రంగం (Domestic IT sector)లో ఉపాధి ఆకర్షణీయంగా, పటిష్టంగా కొనసాగుతున్నట్టు రాజేశ్ గోపీనాథన్ వివరించారు. ప్రస్తుత డిజిటల్‌కు ఉన్న డిమాండ్‌ను టీసీఎస్ (TCS) సహా అనేక కంపెనీలు సద్వినియోగం చేసుకోవడంలో విజయవంతమయ్యాయని చెప్పారు. రానున్న నాలుగేళ్లలో ఐటీ రంగం (IT sector)లో వ్యయం 5 శాతం నుంచి 8 శాతానికి పెరిగే అవకాశాలున్నాయన్నారు.

Advertisement

Next Story