- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీసీఎస్ రూ.10 లక్షల కోట్ల రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ మరో రికార్డును సాధించింది. రూ.10 లక్షల కొట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించిన రెండో భారతీయ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) అరుదైన ఘనతను సాధించింది. మార్కెట్ క్యాప్ పరంగా ఇదివరకు ఈ రికార్డు రిలయన్స్ ఇండస్ట్రీస్ దక్కించుకుంది. సోమవారం నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 10,04,513 కోట్లకు చేరుకుంది.
వరుసగా ఆరు సెషన్లలో ర్యాలీ కొనసాగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ భారీ పెరిగింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 8 శాతం పైగా లాభపడిన టీసీఎస్ షేర్ ధర గరిష్ఠంగా రూ. 2,727కు చేరుకుంది. గతేడాది జూన్ తర్వాత టీసీఎస్ షేర్ ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ రికార్డు సాధించిన అనంతరం టీసీఎస్ సంస్థ దేశీయ అత్యంత విలువైన కంపెనీగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారం రోజుల క్రితం రూ. 15 లక్షల మార్కెట్ క్యాప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.
మిగిలిన లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే రిలయన్స్ మరే ఇతర కంపెనీకి అందనంత వేగంతో కొనసాగుతోంది. కాగా, ఆ నెల 7న టీసీఎస్ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బైబ్యాక్ ప్రతిపాన విషయమై సంస్థ పరిశీలించనున్నదని ప్రకటించడంతో టీసీఎస్ షేర్ భారీ లాభంతో దూసుకెళ్తోంది. దీంతోపాటు సంస్థ ఆర్థిక ఫలితాలు, మధ్యంతర డివిడెండ్‌ను కూడా ప్రకటించనున్నట్టు వెల్లడించింది. పైగా, సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసిక ఫలితాలు మెరుగ్గానే ఉంటాయని ప్రకటించడంతో కంపెనీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు.