పన్ను చెల్లింపుదారులకు కొత్త వార్షిక స్టేట్‌మెంట్ యాక్సెస్ చేసే వెసులుబాటు!

by Harish |
Income tax
X

దిశ, వెబ్‌డెస్క్: పన్ను చెల్లింపుదారులు ఇకపై ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో కొత్త వార్షిక ఐటీ సమాచార స్టేట్‌మెంట్(ఏఐఎస్)ను యాక్సెస్ చేయవచ్చని ఆదాయ పన్ను శాఖ ఆదివారం వెల్లడించింది. వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీలు, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు, విదేశీ చెల్లింపులతో కూడిన అదనపు సమాచారంతో కూడిన కొత్త ఏఐఎస్‌ను తీసుకొవచ్చు. పన్ను పరిధి కిందకు వచ్చే ఆదాయ, టీడీఎస్ సంబంధిత సమాచారం కోసం ఐటీ విభాగం ఫారమ్-26ఏఎస్‌ను ఇస్తోంది. కానీ, దీనికి బదులుగా యాన్యువ‌ల్ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌(ఏఐఎస్)ను ఆదాయ పన్ను విభాగం తీసుకొచ్చింది.

ఫారమ్-26ఏఎస్ కంటే కొత్త స్టేట్‌మెంట్ ద్వారా అదనంగా మరింత సమాచారం అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌కు చెందిన వడ్డీ, డివిడెండ్, కొనుగోలు చేసిన షేర్ల విలువ, మ్యూచువల్ ఫండ్ లావాదేవీలకు చెందిన పూర్తి సమాచారాన్ని సమగ్రంగా పొందడానికి వీలవుతుంది. అన్ని వివరాలు ఒక దగ్గరే లభించడం వల్ల ఫారమ్-26ఏఎస్ కంటే ఏఐఎస్ వల్ల పన్ని రిటర్నులను దాఖలు చేయడం సులభంగా మారుతుందని ఐటీ విభాగం వివరించింది. దీన్ని పన్ను చెల్లింపుదారులు వారి పాన్ కార్డ్ నంబర్ ఉపయోగించి ఆదాయ పన్ను వెబ్‌సైట్ నుంచి యాక్సెస్ చేయవచ్చు.

Advertisement

Next Story

Most Viewed