- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HPCL పెట్రోల్ బంకుల వద్ద టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పలు రంగాలతో పాటు ప్రధాన రహదారుల్లో ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) పెట్రోల్ బంకుల వద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కోసం టాటా పవర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) రిటైల్ ఔట్‌లెట్లలో ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ద్వారా నగరాలు, ఇంటర్‌సిటీ మధ్య ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ వాహనదారులకు మౌలిక సదుపాయాలను అందించనున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఎన్ని ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారు, వీటి ఏర్పాటుకు ఎంత సమయం పడుతుందనే అంశంపై ఇరు సంస్థలు వివరాలను వెల్లడించలేదు. టాటా పవర్ సంస్థ ఇప్పటికే మెట్రో స్టేషన్లు, పెట్రోల్ పంపులు, థియేటర్లు, హైవేలు, షాపింగ్ మాల్‌లు ఉన్న మొత్తం 100 నగరాల్లో 500కి పైగా పబ్లిక్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన పబ్లిక్ ఛార్జింగ్, క్యాప్టివ్ ఛార్జింగ్, హోమ్, వర్క్ ప్లేస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆల్ట్రా-రాపిడ్ ఛార్జర్స్ సదుపాయాలను సంస్థ అందజేస్తోంది.
వీటి ఏర్పాటు ద్వారా అనేక పెట్రోల్ పంపులలో ఎలక్ట్రిక్ వాహనదారులకు అధునాతన టెక్నాలజీ ద్వారా సౌకర్యాలు అందించేందుకు ఈ భాగస్వామ్యం కీలంగా ఉంటుందని టాటా పవర్ తెలిపింది. ‘ఈ వ్యూహాత్మక ఒప్పందం వల్ల విస్తారమైన రిటైల్ స్థావరాన్ని కలిగిన హెచ్‌పీసీఎల్ పెట్రోల్ బంకుల వద్ద ముఖ్యంగా నగరాలు, ప్రధాన రహదారుల్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అందించడం వీలవుతుంది. దీనివల్ల వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు, ఛార్జింగ్ పాయింట్లకు సులభంగా చేరుకునేందుకు వీలవుతుందని’ టాటా పవర్ ఈవీ ఛార్జింగ్ విభాగం హెడ్ సందీప్ బాంగియా అన్నారు.