17 శాతం క్షీణించిన టాటా పవర్ కార్యకలాపాల ఆదాయం

by  |
17 శాతం క్షీణించిన టాటా పవర్ కార్యకలాపాల ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: టాటా పవర్ కంపెనీ(Tata Power Company) 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన త్రైమాసికం(Quarter)లో రూ. 268.1 కోట్ల ఏకీకృత లాభాలను వెల్లడించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం(Last financial year) త్రైమాసికంతో పోలిస్తే 10.3 శాతం పెరుగుదల అని రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో పేర్కొంది.

అలాగే, కార్యకలాపాల ఆదాయం(Operating income) 16.9 శాతం తగ్గి రూ. 6,453 కోట్లకు చేరుకుంది. విద్యుత్ ఉత్పత్తి(Power generation), పంపిణీ విభాగాల నుంచి కంపెనీ తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సంపాదిస్తోంది. ఇది బలహీనమైన పనితీరుని చూపించినట్టు కంపెనీ తెలిపింది. ఉత్పత్తి(Product) ద్వారా వచ్చే ఆదాయం 15 శాతం క్షీణించి రూ. 3,303.16 కోట్లకు చేరుకుంది.

ట్రాన్స్‌మిషన్(Transmission), పంపిణీ విభాగం(Distribution section) 15.1 శాతం పతనంతో రూ. 3,230.92 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. విద్యుత్ సరఫరా అత్యవసర సేవల విభాగంలో ఉండటంతో లాక్‌డౌన్ (lockdown) ఆంక్షల నుంచి సడలింపుతో కొవిడ్-19 (kovid-19) ప్రభావం ఎక్కువగా ఉండదని కంపెనీ యాజమాన్యం(Company ownership) అభిప్రాయపడింది. అయితే, భవిష్యత్తు వ్యాపార పనితీరుపై కొవిడ్-19 ప్రభావంతో కొంత అనిశ్చితి ఏర్పడే అవకాశముందని పేర్కొంది.


Next Story

Most Viewed