వాహన ధరలు పెంచనున్న టాటా మోటార్స్

by Harish |
వాహన ధరలు పెంచనున్న టాటా మోటార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ త్వరలో తన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని భావిస్తోంది. సంస్థకు చెందిన అన్ని రకాల మోడళ్లు, ఎస్‌యూవీలపై ఈ పెంపు నిర్ణయం ఉంటుందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ధరల పెంపు తేదీని కంపెనీ వెల్లడించలేదు. ఉక్కు, అల్యూమియం లాంటి వాహన తయారీలో కీలమైన పరికరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. గత కొన్నాళ్లుగా క్రమంగా ఈ పరికరాల ధరలు పెరుగుతున్నాయని, ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ భారాన్ని వినియోగదారులపై బదిలీ చేస్తున్నట్టు కంపెనీ వివరించింది.

అయితే, టాటా మోటార్స్ ఏ ఏ మోడళ్లపై ధరలను పెంచనున్నది స్పష్టత ఇవ్వలేదు. కాగా, గత కొన్ని నెలల్లోనే ఉక్కు ధరలు భారీగా పెరిగాయి. దీంతో వాహన తయారీలో వినియోగించే పలు పరికరాల ధరలు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. దీంతో ఆటో పరిశ్రమలో ఇప్పటికే హోండా, మారుతీ సుజుకి వంటి కంపెనీలు పలు మార్లు వాహన ధరలను పెంచాయి.

Advertisement

Next Story