- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూలధన నిధుల కోసం చర్చలు జరుపుతున్న టాటా మోటార్స్
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ కార్ల విభాగం కోసం మూలధనాన్ని సమీకరించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్, ఇతర పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు, వ్యాపారం సహా ప్యాసింజర్ వాహనాలను ప్రత్యేక అనుబంధ సంస్థగా ఉంచేందుకు కంపెనీ వాటాదారుల ఆమోదం పొందింది. గతేడాది ఈ ప్రణాళికను కంపెనీ ప్రకటించిన సమయంలో టాటా మోటార్స్ యూనిట్‌ను దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు తెలిపింది.
ప్యాసింజర్ వాహనాల విభాగం కోసం వ్యూహాత్మక భాగస్వామి లేదా ఆర్థిక పెట్టుబడిదారులతో కంపెనీ చర్చలు జరుపుతోంది. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల విభాగం బలమైన వృద్ధి సాధించగలదనే నమ్మకంతో టాటా మోటార్స్ తగిన చర్యలు తీసుకుంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఒప్పందంపై స్పష్టత లేదని కంపెనీ అధికారులు చెప్పారు. కాగా, టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల వ్యాపారాన్ని అనుబంధ సంస్థగా మార్చేందుకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునర్ నుంచి అనుమతి అవసరం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.