- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబులెన్స్ విభాగంలోకి టాటా మోటార్స్ వాహనం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఆంబులెన్స్ విభాగంలో ‘టాటా మ్యాజిక్’ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టింది. ప్రజలకు అత్యంత సరసమైన ఆంబులెన్స్ సేవలను అందించేందుకు, బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీసుకొస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ ఆంబులెన్స్ వైద్య, ఆరోగ్య సంబంధిత సేవల కోసం రూపొందించబడింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతున్న సమయంలో ఈ వాహనం తీసుకురావడం ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ ఆంబులెన్స్‌కు ఉన్న కాంపాక్ట్ డిజైన్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇరుకు వీధుల్లోనూ, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాల్లోనూ సౌకర్యవంతంగా వెళ్లగలదని, తద్వారా రోగులను తక్కువ సమయంలో ఆసుపత్రులకు చేర్చేందుకు వీలవుతుందని కంపెనీ వివరించింది. ‘మ్యాజిక్ ఎక్స్‌ప్రెస్ తీసుకురావడం ద్వారా మెరుగైన హెల్త్‌కేర్ మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో టాటా మోటార్స్ నిబద్ధతను కలిగి ఉంది. ఆంబులెన్స్‌లో రోగులను తీసుకెళ్లేందుకు అవసరమైన సదుపాయాలతో దీన్ని తయారుచేశాం. కొత్త సెగ్మెంట్‌లోకి ప్రవేశించడం ద్వారా టాటా మోటార్స్ ఆంబులెన్స్ విభాగంలో సరసమైన, నమ్మకం ఉన్న మెరుగైన వాహనాల ద్వారా అనేక పరిష్కారాలను అందిస్తుందని’ టాటా మోటార్స్ ప్రొడక్ట్ లైన్ వైస్-ప్రెసిడెంట్ శ్రీ వినయ్ పాఠక్ వెల్లడించారు.