సరికొత్త 'డార్క్ ఎడిషన్' మోడళ్లను తీసుకొస్తున్న టాటా మోటార్స్!

by Harish |
Tata-Motors
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన విజయవంతమైన మోడల్ కార్లను సరికొత్తగా ‘డార్క్ ఎడిషన్’లో అందుబాటులోకి తెస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. టాటా నెక్సాన్, టాటా ఆల్ట్రోజ్, టాటా నెక్సాన్ ఈవీ మోడళ్లలోని అన్ని వేరియంట్లలో నలుపు రంగు వాహనాలను కంపెనీ తీసుకురానుంది. వీటి ధరల శ్రేణి.. టాటా ఆల్ట్రోజ్ డార్క్ రూ. 8.71 లక్షలు, టాటా నెక్సాన్ వేరియంట్లు రూ. 10.41 లక్షలు, నెక్సాన్ ఈవీ రూ. 15.99 లక్షల ధరల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవి ప్రారంభ ధరలు మాత్రమే అని వేరియంట్‌ని బట్టి ధరల్లో స్వల్పంగా మార్పులుంటాయని కంపెనీ తెలిపింది.

‘ముందుగా టాటా మోడళ్లలో మెరుగైన ఆదరణను సంపాదించిన ఎస్‌యూవీ వాహనం హ్యారియర్‌ను డార్క్ ఎడిషన్‌లో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చాము. తాము ఊహించిన దానికంటే ఎక్కువగా వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వచ్చిందని, హ్యారియర్ మొత్తం అమ్మకాల్లో డార్క్ ఎడిషన్‌ విభిన్నంగా, ప్రత్యేకంగా నిలిచింది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇతర మోడళ్లలోనూ డార్క్ ఎడిషన్‌ను తీసుకురావాలని నిర్ణయిచినట్టు’ టాటా మోటార్స్ మార్కెటింగ్ హెడ్ వివేక్ శ్రీవాత్సవ వెల్లడించారు.

Advertisement

Next Story