బిగ్‌బాస్కెట్‌లో వాటా సొంతం చేసుకోవడానికి టాటాకు సిసిఐ ఆమోదం!

by Harish |   ( Updated:2021-04-29 05:18:47.0  )
బిగ్‌బాస్కెట్‌లో వాటా సొంతం చేసుకోవడానికి టాటాకు సిసిఐ ఆమోదం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ కిరాణా దిగ్గజ సంస్థ బిగ్‌బాస్కెట్ కొనుగోలుకు సంబంధించి టాటా డిజిటల్స్‌కు భారత కాంపిటీషన్స్ కమీషన్(సీసీఐ) నుంచి గురువారం ఆమోదం లభించింది. దీని తర్వాత టాటా డిజిటల్ సంస్థ సూపర్ మార్కెట్ గ్రాసరీ సప్లయిస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 64.3 శాతం వాటాను దక్కించుకోవచ్చు. అనంతరం ప్రత్యేక లావాదేవీ ద్వారా సూపర్ మార్కెట్‌కు చెందిన బిగ్‌బాస్కెట్ ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని నిర్వహించే ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్ట్స్‌పై నియంత్రణను పొందే అవకాశం లభిస్తుంది. దీంతో బిగ్‌బాస్కెట్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ వ్యాపార విభాగాలపై టాటా డిజిటల్ సంస్థ నియంత్రణను కలిగి ఉంటుంది.

టాటా డిజిటల్ గనక ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయగలిగితే.. చైనా దిగ్గజం అలీబాబా కంపెనీకి కొంత ఊరట లభించనుంది. అలీబాబా సంస్థ బిగ్‌బాస్కెట్‌లో తనకున్న 29 శాతం వాటాను విక్రయించి బయటపడాలని భావిస్తోంది. దీంతో పాటు ఇంకా ఇతర చిన్న ఇన్వెస్టర్ల వాటాలను టాటా సంస్థ దక్కించుకోనుంది. ఈ ఒప్పందానికి సంబంధించిన రూ. 9,300 కోట్లను టాటా సంస్థ చెల్లించనుంది. కాగా, మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం.. బిగ్‌బాస్కెట్ విలువ ప్రతి ఏటా 57 శాతం వృద్ధిని సాధిస్తోంది. 2019లో కంపెనీ విలువ రూ. 14 వేలకు కోట్లు ఉండగా 2020 చివరి నాటికి సుమారు రూ. 22 వేల కోట్లకు చేరుకుంది. అలాగే, 2024 నాటికి ఈ కంపెనీ విలువ సుమారు రూ. 1.34 లక్షల కోట్లను తాకే అవకాశాలున్నాయని అంచనా. ఈ ఒప్పందం ప్రక్రియ ముగిసిన తర్వాత దేశీయ ఆన్‌లైన్ మార్కెట్లో టాటా సంస్థ బలమైన పోటీదారుగా ఉండనుంది. ఇప్పటికే ఈ విభాగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ సంస్థలు పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed