- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న టాటా గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రజలు జీవించే, పనిచేసే విధానంలో సమూలమైన మార్పులను తెచ్చిపెట్టిందని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. సంస్థ వార్షిక సర్వసభ్య సమావేశాంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెలలో టాటా కెమికల్స్ వ్యాపారాన్ని టాటా గ్లోబల్ బేవరేజస్‌లో విలీనం చేసిన తర్వాత ఇదే తొలి వార్షిక సమావేశం. టాటా వినియోగదారుల ఏకీకృత ఆదాయంలో సుమారు 60 శాతం భారత్ నుంచి వస్తుండగా, మిగిలినది అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తాయి. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన ఎన్.చంద్రశేఖరన్…కొవిడ్-19 వల్ల మారిన పరిస్థితులకు అనుగుణంగానే టాటా గ్రూప్ మారుతుందని తెలిపారు. తాము భారత మార్కెట్లలో రవాణా సమస్యలను ఎదుర్కొంటున్నామని, కార్మికులు వెళ్లిపోవడం, ప్రయాణ, రవాణా నిబంధనల అమలు, రిటైల్ కార్యకలాపాల వంటి అంశాలు తమకు సవాలుగా ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు అవకాశాలను కూడా కల్పిస్తున్నాయని, బేవరేజెస్, ఆహార వ్యాపారాలు విలీనం కావడంతో మరింత పటిష్టంగా ఎదిగేందుకు అవకాశాలున్నాయన్నారు. భవిష్యత్తులో కొత్త అంశాలను నేర్చుకుని, మరింత బలంగా ఎదుగుతామని చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే, టాటా స్టార్‌బక్స్ కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 21 శాతం వృద్ధిని సాధించిందని, అయితే, కరోనా వల్ల చివరి త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై ప్రభావం చూపిందని తెలిపారు.