బ్లాక్ పసుపు విక్ర‌యం.. ఎనిమిది మంది అరెస్ట్‌

by Sridhar Babu |
బ్లాక్ పసుపు విక్ర‌యం.. ఎనిమిది మంది అరెస్ట్‌
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: నిషేధిత బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుపుతున్న ఎనిమిది మందిని ఖ‌మ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వ‌స‌నీయంగా అందిన స‌మాచారంతో శ‌నివారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని విష్ణు హోటల్‌లో టాస్క్‌ఫోర్స్ ఏసీసీ వెంకట్రావు సీఐ వెంకటస్వామి, ఎస్సై రఘు, ఖమ్మం టూ టౌన్ సీఐ తుమ్మ గోపిల‌తో క‌ల‌సి సోదాలు నిర్వ‌హించారు.

తనిఖీల్లో నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపు క్రయవిక్రయాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పినపాక మండలం రేగుపల్లికి చెందిన దుర్గాం సురేష్ అనే వ్యక్తి మెడిసిన్‌లో ఉపయోగించే నిషేధిత అటవీ ఉత్పత్తి బ్లాక్ పసుపు మూలాలను కొంత‌కాలంగా ప‌ట్ట‌ణంలో విక్ర‌యిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. శ‌నివారం రాత్రి విక్రయం జరుపుతున్న దుర్గాం సురేష్‌తో పాటు కొనుగోలు చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడ్డిన వారిలో గుడిపల్లి జగదీష్, తీగబోయిన వెంకటేష్, కామపతి ప్రతాప్, గుడిపల్లి వెంకటరమణ, శానిగరం మహేష్, బతులా గురువయ్య, కీర్తి మహేష్ ఉన్నారు. వీరివ‌ద్ద నుంచి రూ. 2,15,600 న‌గ‌దు, 7 సెల్ ఫోన్లు, బ్లాక్‌ పసుపు ర‌కాలను 2 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల‌ను ఖమ్మం టూ టౌన్‌కు త‌ర‌లించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారికి అప్పగించేందుకు చర్యలు తీసుకున్న‌ట్టు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed