దృష్టి మరల్చి చోరీలు.. దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు

by Sumithra |
దృష్టి మరల్చి చోరీలు.. దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో : అమాయక ప్రజల దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మాదన్నపేటకు చెందిన హబీబ్ ముస్తఫా (44) ఇళ్లల్లో దొంగతనాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నాడు. 1992 నుంచి ఇప్పటి వరకూ పలు దొంగతనాలు చేసి పలుమార్లు పోలీసులకు చిక్కాడు. 2015లో చంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేసి పీడీ నమోదు చేశారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఇదే సమయంలో లాక్ డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే చంద్రాయణగుట్ట, భవానీ నగర్, బాలాపూర్, గజ్వేల్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 కేసులు నమోదయ్యాయి. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేశారు. హబీబ్ ముస్తఫాపై మొత్తం 42 ప్రాపర్టీ దొంగతనం కేసులు, చంద్రాయణగుట్ట, సంతోష్ నగర్ పీఎస్‌లలో 11 ఇళ్ళల్లో లాక్ బ్రేకింగ్ కేసులతో పాటు 15 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం చార్మినార్, చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్ఓలకు అప్పగించారు.

Advertisement

Next Story