పబ్‎లపై టాస్క్‎ఫోర్స్ దాడులు

by Anukaran |   ( Updated:2020-11-07 00:57:01.0  )
పబ్‎లపై టాస్క్‎ఫోర్స్ దాడులు
X

దిశ, వెబ్‎డెస్క్:
హైదరాబాద్‎లో పలు పబ్‎లపై టాస్క్‎ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్‎లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న నాలుగు పబ్‎లపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి వెస్ట్ జోన్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు పబ్‎లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా డ్యాన్స్ ఫ్లోర్లను తెచ్చిన తబులారస, ఎయిర్‎లైవ్, కెమిస్ట్రీ, అమ్నేషియా పబ్‎లపై కేసు నమోదు చేశారు. పబ్‎ల్లో కొవిడ్ నిబంధనలు బేఖాతరు చేసిన పబ్ నిర్వాహకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story