- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్స్‌డ్ సెక్స్ తీర్పుపై తాప్సీ అసంతృప్తి
దిశ, సినిమా :మ్యారిటల్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని నిర్దోషిగా పేర్కొంటూ బిలాస్‌పూర్ హైకోర్ట్ తాజాగా తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న భార్యతో లైంగిక సంపర్కం లేదా ఏవేని లైంగిక కార్యకలాపాలు.. సదరు మహిళ కోరికకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అత్యాచారంగా పరిగణించబడదని కోర్టు తీర్పులో వెల్లడించింది.
దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతుండగా.. బాలీవుడ్ నటి తాప్సీ కూడా స్పందించింది. ‘చివరకు ఇది కూడా వినాల్సి వచ్చింది’ అంటూ తీర్పుపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. జాతిని ప్రభావితం చేసే సమస్యలపై ధైర్యంగా గొంతువిప్పే తాప్సీ.. తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు, అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటావా? అని సుప్రీంకోర్టు నిందితుడిని అడగడంపైనా తాప్సీ ఘాటుగా స్పందించింది. ‘ఆ అమ్మాయిని ఎవరైనా ఈ ప్రశ్న అడిగారా? ఆమె రేపిస్ట్‌ను వివాహం చేసుకోవాలనుకుంటే !!! ??? అది ఒక ప్రశ్ననా !!! ??? ఇది పరిష్కారమా లేదా శిక్షనా? అంటూ ట్వీట్ చేసింది.
Bas ab yehi sunna baaki tha . https://t.co/K2ynAG5iP6
— taapsee pannu (@taapsee) August 26, 2021
సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘లూప్ లపేట, దొబారా’తో పాటు ‘రష్మి రాకెట్, శభాష్ మిథు’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు ఈ మధ్యే ప్రొడ్యూసర్ అవతారమెత్తిన తాప్సీ.. ఫస్ట్ ప్రాజెక్ట్‌ను ‘బ్లర్’ పేరుతో నిర్మించేందుకు సిద్ధమవుతోంది.