- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాప్సీ సినిమాకు కరోనా ఇన్సూరెన్స్
కరోనా మహమ్మారి వల్ల సినిమా ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్ పూర్తైన సినిమాలు సైతం రిలీజ్‌కు నోచుకోక పోగా.. కొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతుండగా.. కొందరు దర్శకులు, నిర్మాతలు ఇంకా చిత్రీకరణ ప్రారంభించేందుకు సంశయిస్తున్నారు. సెట్‌లో ఒక్కరికి కరోనా వచ్చినా, అందరికీ ప్రాబ్లం అయ్యే చాన్స్ ఉండటంతో ఆలోచనలోపడ్డారు. పైగా షూటింగ్ స్టార్ట్ చేస్తే లాక్‌డౌన్ నిబంధనలు పాటించాల్సి వస్తుంది. అదీగాక సెట్‌లో శానిటైజర్, మాస్క్‌లు అంటూ జాగ్రత్తలు తీసుకునేందుకు 20 శాతం అదనపు ఖర్చు కానుంది.
ఈ నేపథ్యంలో ఇవన్నీ ఆలోచించిన ఒక మూవీ యూనిట్ మాత్రం.. కొత్త తరహాలో ముందుకెళ్తోంది. తాప్సీ ప్రధాన పాత్రలో వస్తున్న ‘లూప్ లాపేట’ చిత్ర నిర్మాత కరోనా ఇన్సూరెన్స్ చేయిస్తున్నాడని టాక్. ఒకవేళ సెట్‌లో ఎవరికైనా కరోనా సోకి, నటీనటులు హోమ్ క్వారంటైన్‌కు వెళ్లాల్సి వస్తే.. చిత్రీకరణ ఆగిపోయి నష్టపోవాల్సి వస్తుంది. కానీ ఇన్సూరెన్స్ చేయడం వల్ల నష్టం వచ్చినా సరే.. బీమాతో కవర్ చేయొచ్చనేది ప్లాన్. కాగా కరోనా ఇన్సూరెన్స్ చేయించిన తొలి సినిమా ఇదే కావడం విశేషం. జర్మనీ మూవీ ‘రన్ లోలా రన్’ చిత్రం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆకాశ్ భాటియా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తాహిర్ భాసిన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.